ఓటర్ల జాబితా సర్వేను నిర్లక్ష్యం చేయొద్దు: శివకిరణ్
ఇల్లందు, జూన్ 26 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటి సర్వే ప్రారంభమైందని, ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని 22వ వార్డు కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ అన్నారు. గురువారం 22వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు నెల రోజులపాటు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. ప్రతి ఓటర్‌కు రెండు ఇన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, వివరాలు నింపి ఒక ఫారాన్ని అధికారులకు ఇచ్చి మరొకటి తమ వద్ద భద్రపరచుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రస్తుత ఓటర్లతో మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. సర్వేను నిర్లక్ష్యం చేస్తే ఓటు తొలగిపోయే అవకాశం ఉండటంతో పాటు భవిష్యత్తులో పలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎల్‌వో బాలరాజు, వార్డు ఆఫీసర్ రజిని, అంగన్‌వాడీ టీచర్ అజ్మీర సక్కుబాయి, బీఎల్‌ఏలు కోలపురి ఝాన్సీ, అస్లాం తదితరులు పాల్గొన్నారు.






