మూసి ప్రక్షాళనకు అడ్డుపడొద్దు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్, మార్చి 14: మూసి ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అడ్డుపడొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మూసి ప్రక్షాళన చేపట్టనున్నామని, మూసి వల్ల భూగర్భ జలాలు కలుషితమై నల్లగొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని చెప్పారకు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్లు మూసి ప్రక్షాళనకు టెండర్లు పిలిచిందన్నారు.
కాగా అంతకుముందు జిల్లా కేంద్రంలోని సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ల ద్వా రా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లను, సర్టిఫికెట్లను మంత్రి కోమటిరెడ్డి పంపిణీ చేశారు. మహిళలు పట్టుద లతో ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలన్నారు.
శిక్షణ పొందిన మహిళలు సంఘా లుగా ఏర్పాటయితే వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని, స్కూలు విద్యార్థుల యూని ఫాం కుట్టే పనిని సంఘాలకే అప్పచెపుతామని వెల్లడించారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్ పాల్గొన్నారు.




