15 March, 2026 | 3:39 AM

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

15-03-2026 12:49 AM

పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలను వాహనదా రులు పాటించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో హనుమంతరావు వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులకు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్ రూట్, త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పారు. ప్రతి వాహనదారుడు అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాం బాబు, నారాయణస్వామి, పులి జగన్, గరిగంటి రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్‌పతి యాదగిరిగౌడ్, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, ఖైరతాబాద్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్ నేత, పంజాల వెంకటేశ్‌గౌడ్, జహంగీర్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.