calender_icon.png 14 November, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటను దళారులకు విక్రయించొద్దు

14-11-2025 01:20:44 AM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: ఎమ్మెల్యే కసిరెడ్డి 

ఆమనగల్లు, నవంబర్ 13( విజయ క్రాంతి) ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని, రైతులు పండించిన పంటల కు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కు శ్రీకారం చుట్టినట్లు  కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్లు మండలం పోలేపల్లి గేటు సమీపంలో కాటన్ మిల్లులో  పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని, దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వానిబంధనలను పాటించి  రైతులను ఇబ్బందులు గురి చేయకుండా కొనుగోలు కేంద్రాల్లో  రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

తరుగు, తూకం, తేమ పేరిటా రైతులను ఇబ్బందులు గురిచేయొద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మార్కెట్ డైరెక్టర్లు వసుపుల శ్రీశైలం, రమేష్ గౌడ్, జంగయ్య గౌడ్, యాదయ్య, శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు యాట నర్సింహ, వెంకట రంగారెడ్డి, బాల్ రామ్, జగన్, విజయ్, కృష్ణ నాయక్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.