calender_icon.png 14 November, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెరవేరిన నిరుపేదల సొంతింటి కల

14-11-2025 01:18:52 AM

  1. లబ్ధిదారులకు నియామకపత్రాలు అందజేసిన 

చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ  పామేన్ భీమ్ భరత్  

మొయినాబాద్, నవంబర్ 13(విజయ క్రాంతి) నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ ఫామేనా బీమ్ భరత్ అన్నారు. గురువారం మొయినాబాద్ మండలం ఎత్ బార్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం పలువురు లబ్ధిదారుల కు మంజూరైనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరమైన మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందజేస్తుందని ఎస్సీ ఎస్టీలకు అదనంగా మరోక లక్ష రూపాయలు నిర్మాణం కు ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గం లో ఇప్పటివరకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని విడతలవారీగా అన్ని గ్రామాలకు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులంతా త్వరగా నిర్మాణాలను చేపట్టాలని ఆయన కోరారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి  లబ్ధిదారులకు త్వరలోనే బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ల పైన ఓట్లు దండుకున్నారే తప్ప.... అరులకు ఎక్కడ ఇండ్లు కేటాయించలేదని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమ కు పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమం లో రాష్ర్ట అధికార ప్రతినిధి గౌరి సతీష్ గారు,మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య గారు ఆయా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.