హరహదారి భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమం
ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ఎస్సై సోమేశ్వరరావు
ఆళ్ళపల్లి,(విజయ క్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక ఎస్సై ఎం సోమేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, విద్యార్థులు, ప్రజలతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం ఎస్సై సోమేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతి ఒక వాహనదారుడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని అలాగే మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని అతివేగం వలన అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
భవిష్యత్ తరాలకు భద్రత అలవాటు చేయడం కోసం పాఠశాలల్లో అవగాహన సదస్స ఏర్పాటు చేయడంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారి భద్రతావారోత్సవాలు సందర్భంగా పోలీస్ శాఖ, RTO, విద్యా సంస్థలు కలిసి ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కే.శాంతారావు గ్రామపంచాయతీ సెక్రటరీ వి శిరీష వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




