ఈనెల 18న హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి
13-04-2026 09:21 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో ఈనెల 18న నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు సామల తిరుపతి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ఈనెల 18న మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించబోయే హిందూ సమ్మేళనం గురించి కరపత్రాల ఆవిష్కరణ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు సామల తిరుపతి ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం సరోజా తిరుపతి,ఉప సర్పంచ్ ఆదర్శ్,మండలం ఆర్ఎస్ఎస్ ప్రముఖ తంగడపల్లి నీలేష్, ఖండ బౌద్ధిక్ ప్రముఖ లింగం పద్మాకర్, ఖండ కార్యవాహ పొట్టే విలాస్,హిందు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




