13 April, 2026 | 10:52 PM

అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుందాం

13-04-2026 09:43 PM

మాల మల్లయోదుల కమిటీ

సత్తుపల్లి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సత్తుపల్లిలో నేడు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాలమల్ల యోధుల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిల్లి కవితా మల్లిక్, బోడా వెంకటేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లిలోని అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించిన అనంతరం స్థానిక జవహర్ నగర్ లోని కొమ్మేపల్లి కాలనీ నుంచి భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జ్యోతి నిలయం వద్ద జరిగే కార్యక్రమంలో మాల మల్లయోధుల భవిష్యత్ కార్యక్రమాలపై సమావేశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన, మహిళా సాధికారత కోసం కృషి చేసిన ఆయన మన దేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని, సామాజిక న్యాయం, విద్య, కార్మిక హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈరోజు మనమంతా స్మరించుకోవాలని కోరారు. నేడు దేశవ్యాప్తంగా అంబేద్కర్ వాదం విస్తరించిందని, ఆయన అందించిన ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు. దేశ ప్రజలందరిని విభజించు, పాలించు అనే విధానంతో పాలకులు పబ్బం గడుపుతున్నారు.