తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్
ములకలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. సోమవారం ములకలపల్లి లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 23,24,25 తేదీలలో కొత్తగూడెం క్లబ్ లో జరగనున్న రాష్ట్ర మహాసభలలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
రైతాంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పరిష్కరించడంలో విస్మరించిందని అన్నారు. రైతులకు రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాలువ నీళ్లు రైతాంగానికి సాగు కోసం అందించాలని డిమాండ్ చేశారు. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతాంగ సమస్యలపరిష్కారానికి మహాసభలలో కర్తవ్యాలు తీసుకొని మరిన్ని రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్, నాయకులు పోడియం వెంకటేశ్వర్లు,మాలోతు రావూజ, గౌరి నాగేశ్వరరావు, నిమ్మల మధు,కుంజా రాంమూర్తి,గొగ్గల ఆదినారాయణ, గోపగాని లక్ష్మీ నరసయ్య, బైరు ప్రసాద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.




