దోమలు సమస్య పరిష్కరించండి
జోనల్ కమిషనర్ కు వినతి
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు మరియు పటేల్ కుంట చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలంటూ సోమవారం రోజున బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనులు చేపట్టడానికి కోటి 20 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరై సుమారు రెండు నెలలు గడుస్తున్నా కానీ గుర్రపు డెక్క తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదని దీంతో నాచారంలో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
అధికారుల అలసత్వం వల్లనే పనులు చేపట్టడం లేదని తక్షణమే గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించాలని కమిషనర్ విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిగాను కమిషనర్ సానుకూలంగా స్పందించారని వెంటనే అధికారులకు ఫోన్ చేసి తక్షణమే పటేల్ కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారని శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




