సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొద్దు
29-03-2026 12:00 AM
ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): పోలీస్ శాఖ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ సీపీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ సభలో ఒక అధికారి గురించి మాట్లాడితే ఆ శాఖను డిమోరల్ చేసినట్లు ఉంటుందన్నారు.




