21 April, 2026 | 3:02 AM

సామాజిక సేవకు అశోక్ మహుల్కర్‌కు డాక్టరేట్

21-04-2026 02:02 AM

వాంకిడి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మూడు దశాబ్దాలుగా చేస్తున్న సామాజిక సేవకు గుర్తింపుగా ఆసిఫాబాద్ జిల్లా భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షుడు అశోక్ మహుల్కర్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లూసియానా అమెరికన్ యూనివర్సిటీ ఈ బిరుదును ప్రదానం చేసింది.

ఉస్మానియా వర్సిటీ నుంచి సోషియాలజీలో ఎం.ఫిల్ పూర్తి చేసిన ఆయన సామాజిక సేవలో ప్రవేశించారు. క్రీడ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ఐటీడీఏలో పని చేస్తూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేశారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ అన్ని కృష్ణ భరద్వాజ్, డాక్టర్ రమేష్ బినోనేకర్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి శివదాస్, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ డాక్టర్ సుమిత్ర సేన్, డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.