calender_icon.png 2 November, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడి చేతులతో మోటార్ ఆన్ చేయకండి

01-11-2025 12:00:00 AM

డీఈ నందయ్య 

అశ్వారావుపేట, అక్టోబర్ 31, (విజయక్రాంతి) : రైతులు తడి చేతులతో మోటార్ స్టార్టర్ ఆన్ చేయవద్దని ఆ విధంగా చేస్తే ప్రమాదానికి గురి అవుతారని పాల్వంచ ట్రాన్స్ కో డి ఈ నందయ్య తెలిపారు. రైతులకు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవటం గురించి అవగాహన కల్పించటానికి నారంవారి గూడెం లో పొలం బాట కార్యక్రమం చేపట్టారు. డి ఈ నందయ్య కృష్ణ లు మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు.తడి చేతులతో మోటారు ఆన్ చేయటం గాని, ఆఫ్ చేయటం గాని చేయరాదు అన్నారు.

ఐరన్ స్టార్టర్ బాక్స్ లు తీసివేసి ప్లాస్టిక్ స్టార్టర్ బాక్స్ లను ఏర్పాటు చేసుకోవాలని  సూచించారు.మోటార్లకు కెపాసిటీర్లు ఏర్పాటు చేయటం వల్ల లో ఓల్టేజ్ సమస్య వుండదని, మోటార్లు కాలిపోకుండా ఉంటాయని తెలిపారు.మోటార్లకు ఏర్పాటు చేసిన ఆటో స్టార్టర్ లను తొలగించాలి అని విజ్ఞప్తి చేశారు.

ఫెయిల్ అయినా ట్రాన్స్ ఫార్మర్ లను  విద్యుత్ శాఖకు సంబంధించిన వాహనాలలోనే తీసుకొని వెళ్ళాలి అని తెలిపారు.అనధికార వ్యవసాయ సర్వీసుల ను క్రమబద్దీకరణ చేసుకోవలని సూచించారు.అనధికార వ్యవసాయ సర్వీసు లోడ్ లను 5 ఎచ్ పి ల నుండి7.5 ఎచ్ పి వరకు  లోడ్ లను అధికారికంగా పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో  అశ్వారావుపేట ఏ ఈ జి రవి లైన్ మెన్ చంద్రశేఖర్ ,సిబ్బంది రైతులు పాల్గొన్నారు.