01-11-2025 12:00:00 AM
భూదాన్ భూముల వ్యవహరంలో సింగల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
హైదరాబాద్, అక్టోబర్ 31: భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 17న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం సస్పెండ్ చేసింది. నాగారం సర్వే నంబర్ 194, 195లలోని బ్యూరోక్రాట్స్ భూములను నిషేధిత జాబి తాలో ఉంచాలంటూ గతంలో సిం గిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో బ్యూరోక్రాట్స్ ఆపిల్ చేశారు.
ఈ నేపథ్యం లో ఆధారాలను పరిశీలించిన తర్వాత డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. అవి భూదాన్ భూ ములు కానప్పుడు నిషేధిత జాబితాలో ఎందుకు ఉండాలని హైకో ర్టు వ్యాఖ్యానించింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్‌లకు సర్వే నంబర్ 194,195 భూమి పట్టా భూములేనని జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మం డలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181,182, 194, 195లలో గల భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇత రులు అక్రమంగా పొందారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ జరపాలంటూ బిర్ల మల్లేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం గత కొద్ది కాలంగా హైకోర్టులో విచారణ జరుగుతోంది.
హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిం చింది. బతుకమ్మ కుంట ప్రైవేట్ స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోలేని సుధాకర్ అనే వ్యక్తి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని రంగనాథ్‌ను ప్రశ్నించింది.