calender_icon.png 1 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు గ్రామాల నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక

01-11-2025 12:00:00 AM

  1. గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తును పునరుద్ధరించాలి

నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం

అచ్చంపేట అక్టోబర్ 31: వర్షం వలన కలిగిన నష్టం వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం తెలిపారు. ఈనెల 28, 29న కురిసిన భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని మార్లపాడు తం డా జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవా రం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి. అమరేందర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ దేవసహాయం, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి గ్రా మాన్ని సందర్శించి నష్టనివారణ చర్యలను పరిశీలించారు.

మొంథా తుఫాను కారణంగా తీవ్ర వర్షాలు కురవడంతో నక్కలగం డి రిజర్వాయర్ పరిధిలోని మార్లపాడు తం డా పూర్తిగా జలమయమైంది. సుమారు 350 కుటుంబాలు, 638 మంది జనాభా ఉ న్న ఈ గ్రామం వరద జలాల చుట్టుముట్టడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామస్తులను సి ద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పు నరావాస కేంద్రానికి తరలించి.. భోజన వస తి వైద్య సదుపాయాన్ని కల్పించారు. జిల్లా అదనపు కలెక్టర్లు, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి, పంట నష్టం, గృహ నష్టం, ప్రజల అవసరాలపై వివరాలు సేకరించారు.

ముంపు నీరు తగ్గిన అనంతరం పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని డ్రైనేజీలలో పూడికతీత, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లడం, దోమల మందు పిచికారి వంటి చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పనులు ప్రారంభించారు. పంట నష్టాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపి, బాధితులకు సహాయం అంది స్తామని అదనపు కలెక్టర్లు హామీ ఇచ్చారు.

పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండే లా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వివరించ గా, వాటిని తక్షణం పరిష్కరించే చర్యలు తీ సుకుంటామని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, విద్యుత్, రెవిన్యూ, పంచాయితీరాజ్ శాఖల అధికారులు తాహసిల్దార్ సైదులు, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.