calender_icon.png 18 November, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీ హెచ్‌ఎంలు ఎంఈవోలుగా వద్దు

05-11-2024 01:46:20 AM

  1. డీఎస్‌ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం
  2. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి జీటీఏ సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): జిల్లా పరిషత్ హెచ్‌ఎంలను ఎంఈవో బాధ్యతల నుంచి తప్పించాలని లోకల్ క్యాడర్ గవర్న్‌మెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) అధ్యక్షుడు ఎం.వీరాచారి డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.

హెచ్‌ఎంలకు ఎం ఈవోలుగా అదనపు బాధ్యత (ఎఫ్‌ఏసీ)లు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపా రు. తక్షణమే ఆ ఉత్తర్వులను రద్దు చేసి, వారి స్థానాల్లో ప్రభుత్వ సూల్ అసిస్టెంట్‌కు పదోన్నతులు/అదనపు బాధ్యతలు ఇవ్వాల ని కోరారు. లేకుంటే తాము న్యాయ పోరాటం చేస్తామని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.