20 June, 2026 | 8:51 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

05-11-2024 01:47 AM

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): దీపావళి, ఛఠ్ పూజా పండుగల సందర్భంగా రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 7,435 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గత ఏడాది 4,500 ప్రత్యేక రైళ్లు నడుపగా, ఈ ఏడాది భారీగా పెంచింది. దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగ సీజన్‌లో వివిధ గమ్యస్థానాలకు 860 ప్రత్యేక రైళ్లను నడుపు తున్నదని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 234 రైళ్లను అధికంగా నడుపుతున్నట్టు వెల్లడించారు.

ఈ నెల 3న 32 ప్రత్యేక రైళ్లు నడపగా... సోమవారం మరో 37 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు చెప్పారు. మణుగూరు, మహబూబ్‌నగర్, కరీంనగర్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు. కాకినాడెే- సికింద్రాబాద్, కాకినాడ -లింగంపల్లి, సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ రక్సౌల్, కాచిగూడ మధురై, సికింద్రాబాద్ కాచిగూడ -నిజాముద్దీన్, మౌలాలి -ముజఫర్‌పూర్, మణుగూరు బెల్గాం తదితర రైళ్లు తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాలకు, అక్కడి నుంచి తెలంగాణకు నడుస్తున్నాయని వివరించారు.