24 August, 2026 | 10:17 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

మాకు న్యాయం చేయండి

17-06-2025 01:29 AM

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్యకు మొరపెట్టుకున్న  జేజే డెవలపర్స్ బాధితులు

నిజామాబాద్ జూన్ 16 (విజయ క్రాంతి): స్థిరాస్తి వ్యాపారుల మోసానికి బలైన బాధితులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపి సాయి చైతన్యను సోమవారం కలిసి తమకు న్యాయం చేయవలసిందిగా మొరపెట్టుకున్నారు.

జె జె డెవలపర్స్ ఇందూర్ అవని వెంచర్స్ భూ యజమానులు  ఫైనాన్సర్ కుమ్మక్కై కుట్రతో తమకు ప్లాట్లు చేసి అమ్మి అరవై కోట్లకు పైగా విలువ గల భూమిలో ముందుగా ప్లాట్ లో నంబర్ వేసి అప్పగించినపోటీకి నీ సదరు స్థిరాస్తి వ్యాపారులు తమ ప్లాట్ల లోకి వెళితే తరిమి వేస్తున్నారని తమ ప్లాట్లు తమకు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతు న్నారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ జే జే డెవలపర్స్ బాధితులు ఈరోజు జిల్లా కలెక్టర్ , పోలీస్ శాఖ కమిషనర్ సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేశారు. 

తమను మోసానికి గురిచేసిన జేజే డెవలపర్స్ భూ యజమానులు ఫైనాన్షియస్ లపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేసి తమ ప్లాట్లను ఇప్పించాల్సిందిగా జిల్లా అధికారులను బాధితులు మొరపెట్టుకుంటున్నారు.