2 April, 2026 | 1:33 AM

విమాన ప్రమాద మృతులకు నివాళులు

17-06-2025 01:25 AM

అర్మూర్, జూన్ 16 (విజయ క్రాంతి) : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం లో మరణించిన వారికి  సోమవారం అర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ ఘటన కారణంగా మెడికల్ కాలేజీలో మరణించిన విద్యార్థుల ఆత్మశాంతికి రెండు రెండు నిమిషాలు మౌనం పాటించి  నివాళులు అర్పించడమైనది.

ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని కలిగించాలని ఈ సందర్భంగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, కోశాధికారి గజ్జల చైతన్య, సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి, మాజీ అధ్యక్షులు,  న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.