18 April, 2026 | 12:25 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

యోగా చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

21-06-2025 07:09 PM

సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి..

తాడ్వాయి (విజయక్రాంతి): యోగా చేయండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండని ప్రముఖ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైంటిస్ట్ ఎల్లారెడ్డి విచ్చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యోగ చేయాలని యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. యోగా మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. తాను ఇదే తాడువాయి పాఠశాలలో చదువుకొన్నానానని ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాటిమీది గంగారెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, సంజీవులు, సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.