21-06-2025 07:06:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారాం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వివిధ యోగాసనాలను నిర్వహించి వాటి వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి గజ్జరం తదితరులు ఉన్నారు.