2 July, 2026 | 3:17 AM

అల్ఫోర్స్‌లో ఘనంగా డాక్టర్స్ డే..

02-07-2026 02:13 AM

కొత్తపల్లి, జూలై 1 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో జాతీయ  వైద్యుల  దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత , విఎన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్  వి.నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఉంటుందని, ఏర్పరచుకున్న లక్ష్యాలను ఎటువంటి ఇబ్బంది లేకుం డా సాధించాలనే కోరిక ఉంటుందని, ఈ కోరికలను ఎటువంటి ఆటంకం లేకుండా డాక్టర్లు చేస్తారని అన్నారు.

సమాజాభివృద్ధిలో వైద్యుల పాత్ర చాలా కీలకమైనదని, వెలకట్టలేనిదని తెలిపారు. వైద్యుల వలన సమాజంలో అభివృద్ధి చోటు చేసుకుంటుందని, ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి వారు చేసిన కృషి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా ఉంటుందని చెప్పారు.  డాక్టర్స్,  చార్టెడ్ అకౌంటెంట్ల విశిష్టతను తెలియజేయడానికి విద్యార్థులు పలు నాటికలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.