15-10-2025 06:52:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఇటీవల పదోన్నతి మీద నిర్మల్ జనరల్ ఆసుపత్రికి ఆర్ఏంఓగా వచ్చిన డాక్టర్ చింతపండు రవికుమార్ ను బుధవారం జిల్లా ఫిజీషియన్ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఆర్ఎంయు కార్యాలయంలో శాలువతో సత్కరించి పూల బొకేలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామెర రాములు, జిల్లా ఫిజీషియన్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్, కార్యదర్శి డాక్టర్ రవికుమార్, కోశాధికారి డాక్టర్ రనీత్ కుమార్ లు పాల్గొన్నారు.