calender_icon.png 21 February, 2026 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి: ఎంపీడీవో శివ కృష్ణ

21-02-2026 07:19:33 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలల  తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల  సమావేశానికి శనివారం నాడు మండల అభివృద్ధి అధికారి శివకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అందరు ప్రభుత్వ పాఠశాలలోని చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేయడమే కాకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనంతో పాటు అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.

మూడవ తరగతి విద్యార్థుల కోసం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎక్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు విద్యార్థుల తోడ్పాటు అవసరమని ఆయన అన్నారు.  సర్పంచ్ లక్ష్మయ్య  ఉపాధ్యాయ వృత్తినుండి రావడం సంతోషకరమని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాల్ సింగ్ మాట్లాడుతూ... గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు దాతల సహాయముతో అచ్చంపేట పాఠశాలలో ఒక తరగతి గది నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.

అలాగే కలెక్టర్ గారి చొరవతో  రెండు తరగతి గదులను నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మూడో తరగతి, ఐదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రతిభను వారి తల్లిదండ్రుల ముందు ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య సీఆర్పీలు బి శ్రీధర్ కుమార్, ఎం వరలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు జోసఫ్ రత్నాకర్, సంతోష్ కుమార్, రమాదేవి, సమత, సాయిప్రసాద్ , సుష్మ, మౌనిక మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.