28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కలెక్టరేట్‌లో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

04-04-2026 01:14 AM

హనుమకొండ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): హనుమకొండ కలెక్టరేట్లో సాయిధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఎన్.రవి అధ్యక్షత వహించగా, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్ యాదవ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడని,దొడ్డి కొమురయ్య సాయుధ పోరాట పటిమను ఈ సందర్భంగా కొనియాడారు.

దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆసనాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏనుగు మానస, బీసీ సంఘం నాయకులు డాక్టర్ చందా మల్లయ్య, డాక్టర్ సవ్వాసి శ్రీనివాస్, ప్రభాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొము రయ్య జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి లతో కలిసి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో దొడ్డి కొమురయ్య కీలకపాత్ర పోషించారని ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్లి రవి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖాధికారి పుష్పలత, బిసి సంఘ ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.