29 August, 2026 | 1:13 AM

ఆర్యవైశ్య భవన నిర్మాణానికి 13న శంకుస్థాపన

29-08-2026 12:41 AM

ముఖ్యమంత్రిని కలిసిన ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు

షాద్‌నగర్ ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉప్ప ల్ భగాయత్లోని ఐదు ఎకరాల స్థలంలో ని ర్మించనున్న భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమయం కే టాయించేందుకు ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సెప్టెంబర్ 13న శంకుస్థాపన కార్యక్రమానికి సమయం కేటాయించారు.

ఇందుకు ముఖ్యమంత్రికి ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే ప్రకాశ్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, ఉప్పల్ భగాయత్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పలబట్ల ఆనంద్ బాబు, కొండ్లే మల్లికార్జున్, కోశాధికారి రేణికుంట్ల గణేష్ గుప్తా, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ, మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తదితరులు ఉన్నారు.