22 June, 2026 | 7:57 PM

Breaking News

పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •  

దోమకొండలో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

03-04-2026 05:25 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు  నిర్వహించారు. ముత్యంపేట  రోడ్డు క్రాసింగ్ వద్ద ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి సర్పంచ్ నరసయ్య, మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్, కురుమ సంఘం అధ్యక్షుడు నాగ నాగరాజు పూల దండలు వేసి, ఆయన సేవలను కొనియాడారు.  కార్యక్రమంలో ఉప సర్పంచ్  బొమ్మెర శ్రీనివాస్,  వార్డ సభ్యులు పాలకుర్తి శేఖర్, నేతుల బాలమణి, కాంగ్రెస్ నాయకులు నల్లపు శ్రీనివాస్, షమ్మీ, నయీం, నేతుల సుధాకర్,  పేతురు మల్లేశం, గూని కొమరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.