17 April, 2026 | 4:32 PM

జుట్టు సడెన్‌గా ఊడిపోతుందా?

18-05-2025 12:00 AM

శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది జీవక్రియ, హార్మోన్ల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అది శరీరంలోని వివిధ అవయవాలను ప్రభావితం చేస్తుంది. వాటిలో ఒకటి జుట్టు. కాలేయ సమస్యలు జుట్టుపై ఎలాంటి ప్రభావాలను చూపుతాయో తెలుసుకుందాం..

కాలేయం ఆహారం నుంచి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను.. ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి విటమిన్ డిలను గ్ర హించడంలో సహాయపడుతుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు పోషకాలను గ్రహించడంలో సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. కొత్త జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. కాలేయం శరీరంలోని హార్మోన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

కాలేయం సరిగ్గా పని చేయకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు దెబ్బతింటాయి. ఫలితంగా జుట్టు సన్నగా మారుతుంది. జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. కాలేయం దెబ్బతిన్నట్లయితే.. రక్తంలో ఆక్సిజన్ రవాణా తగ్గినప్పుడు, తగినంత పోషకాలు, ఆక్సిజన్ జుట్టు మూలాలకు చేరవు. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి విరిగిపోతుంది. 

కామెర్లకు జుట్టు రాలడం మధ్య సంబంధం ఏమిటంటే.. లివర్ సిర్రోసిస్ లేదా హెపటైటిస్ వంటి వ్యాధులు కామెర్లకు కారణమవుతాయి. దీనివల్ల చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఈ స్థితిలో శరీరం తీవ్రమైన బలహీనతను, ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొంటుంది. ఇది కూడా జుట్టు రాలడానికి ఒక కారణం.