calender_icon.png 13 September, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై పట్టింపు లేదా?

22-09-2024 01:54:29 AM

ఏబీవీపీ నాయకుల ఆగ్రహం

సిరిసిల్లలో సీఎం దిష్టిబొమ్మ దహనం 

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): జిల్లాలోని హాస్టల్ విద్యార్థులపై పట్టి ంపులేని కారణంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ రాష్ర్ట హాస్టల్స్ కనీనర్ మారవేణి రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థుల బతుకులు ఆగం చేయడమేనా అని ప్రశ్నించారు. జిల్లాలోని హాస్టళ్లను ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లాలోని గురుకుల విద్యాసంస్థల్లో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.