calender_icon.png 13 September, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సంజీవని హనుమాన్ ఆలయ భూముల సర్వే

22-09-2024 01:53:27 AM

బెల్లంపల్లి, సెప్టెంబర్ 22: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న సంజీవని హనుమాన్ దేవాలయ భూములు ఆక్రమణలకు గురువుతున్నాయన్న సమాచారంతో శనివారం దేవాదాయశాఖ అధికారులు సర్వే జరిపారు. దేవాదాయ, ధర్మాధాయశాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ ఆదేశాలతో ఆదిలాబాద్ సహాయ కమిషనర్ నవీన్‌కుమార్, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. వారం రోజుల్లోగా దేవాదాయశాఖకు చెందిన భూములకు సంబంధించిన నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని వారు తెలిపారు.