20 August, 2026 | 7:28 PM

బీసీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు ఉందా?

12-11-2024 01:14 AM
  1. బీఆర్‌ఎస్‌లో ఎంతమంది బీసీలకు పదవులిచ్చారు?
  2. మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపాటు

సిరిసిల్ల, నవంబర్ 11 (విజయక్రాంతి): బీసీల సంక్షేమం కోసం మాట్లాడే హక్కు కేటీఆర్‌కు ఉందా అని రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎంతమంది బీసీల కు ఉన్నత పదువులు కట్టబెట్టారని నిలదీశారు. స్థానిక సంస్థల్లో అన్యాయం చేసి ఇప్పుడు బీసీల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు.

సోమవారం వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారిని కార్తీక మాసం పురస్కరించుకుని కుటుంబంతో కలిసి మంత్రి పొన్నం దర్శించుకున్నారు.  మొదట కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడిమాతో మాట్లాడుతూ..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమేనని చెప్పారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు ఉన్నారు.