వక్ఫ్ ఆస్తులను బీసీలకు పంచిపెట్టే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉందా..!
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ ఆగస్టు 31:(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కుల గణన లెక్కలు ఒక తప్పుల తడక అని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.25 % అని ముస్లిం బీసీలు 10.8% అని తేల్చి ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్ పైన ధన్ పాల్ సూర్యనారాయణ ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీసీ బిడ్డల రిజర్వేషన్లను ముస్లింలకు పంచి పెట్టె రేవంత్ సర్కార్ కు ముస్లింల వక్ఫ్ భూములను బీసీ బిడ్డలకు పంచె దమ్ము ఉందా అని సూర్యనారాయణ ప్రశ్నించారు. ఇది బీసీ డిక్లరేషన్ బిల్ కాదు ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మతపరమైన ఈ రిజర్వేషన్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని పంపాల్ సూర్య నారాయణ స్పష్టం చేసారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్ను ఎప్పటికీ అంగీకరించలెమని 42 శాతం మొత్తం రిజర్వేషన్ బీసీలకే రావాలని డిమాండ్ చేసారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఏ తుంగలో తొక్కరో సమాధానం చెప్పాలన్నారు. సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున లక్ష కోట్ల సంక్షేమ నిధి ఎక్కడ అని ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? పోయిన సంవత్సరం బడ్జెట్ లో కేవలం 9200 కోట్లు మాత్రమే పెట్టి బీసీలను మోసం చేసినందుకు క్షేమపన చెప్పలన్నారు.
బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి..? వెంటనే బీసీలకు వడ్డీ లేని 10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఫీ రియంబర్స్ మెంట్ విడుదల చేయక బీసీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారని వెంటనే ప్రభుత్వం ఫీ రియంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే ముందు ముస్లింలను 10% బీసీ రిజర్వేషన్ నుండి తొలగించాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని లేదంటే ఏ స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఈ డ్రామాలు ఆడుతున్నారో అదే స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలు కాంగ్రెస్ ను బొంద పెట్టడం ఖాయం అని హెచ్చరించారు.






