3 September, 2026 | 12:35 PM

నిస్వార్థ సేవకు ఘన సన్మానం

31-08-2025 | 11:49pm

ఖమ్మం,(విజయక్రాంతి): షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఖమ్మం జిల్లా  అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ  ఉద్యోగ విరమణ కార్యక్రమం ఖమ్మం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తొలి పలుకులు తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఏలూరి శ్రీనివాసరావు , కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మధిర నియోజకవర్గం,అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) పి శ్రీనివాసరెడ్డి , టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి కొనేదన శ్రీనివాసరావు, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, ఇతర అధికారులు అదేవిధంగా  టీఈజేఏసీ, టీజీఓ, సాంఘిక సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

 నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన కస్తాల సత్యనారాయణ  1991 సెప్టెంబర్ 7న వాజేడు గ్రామంలో గ్రూప్ 2 వార్డెన్ గా ఉద్యోగ నియామకం జరిగింది ఉద్యోగ ప్రస్థానంలో అనేక పదోన్నతులు పొంది డిడి సోషల్ వెల్ఫేర్ గా పదవి విరమణ చేశారు విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్న  కస్తాల సత్యనారాయణ  జిల్లా అధికారుల చేత మనన్లు పొందారు తన ఉద్యోగ జీవితంలో వివిధ హోదాలలో అధికార బాధ్యతలు స్వీకరించి నిబద్ధత గల ప్రభుత్వాధికారిగా ప్రజలతో మమేకమై తోటి ఉద్యోగస్తులతో అభిమానంతో వ్యవహరిస్తూ సోషల్ వెల్ఫేర్ శాఖను ప్రజలకు చేరువచేయుటలో కీలకపాత్ర పోషించారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఏలూరి శ్రీనివాసరావు  మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటానికి అహర్నిశలు కృషి చేశారని అభినందించారు సంఘాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారని అభినందించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన సత్యనారాయణ  వ్యవసాయం పట్ల కుటుంబ బంధాలకు ఎక్కువగా విలువలు ఇచ్చే వారిని అభినందించారు. అడిషనల్ కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కస్తాల సత్యనారాయణ జిల్లా అధికారిగా విశేషమైన సేవలు అందించారని విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దటంలో ఘననీయమైన పాత్ర వహించారని భవిష్యత్తులో ఇదే సేవా గుణాన్ని కొనసాగించాలని చెప్పారు. 

ఈ కార్యక్రమాన్నిదేశించి కస్తాల సత్యనారాయణ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమకు సహకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ గారికి షెడ్యూల్ క్యాస్ట్ జిల్లా కార్యాలయ సిబ్బందికి, వసతి గృహ సంక్షేమ అధికారులకు, తమ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఉద్యోగ విధి నిర్వహణలో తన కుటుంబ సభ్యుల యొక్క సహకారం మరువలేనిదని అర్ధాంగి శ్రీమతి వసంత గారిని తమ కుమారులను కోడళ్లను తమ అన్న వదినలను బావ కొండబాల కోటేశ్వరరావు గారి సహకారం వారి బావమరిది గారి సహకారం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.