3 September, 2026 | 3:17 PM

భక్తుల కొంగుబంగారమైన శుభం కరోతి గణపతి ఆలయం

01-09-2025 | 12:00am

 గణపతి నవరాత్రుల సందర్భంగా పోటెత్తుతున్న భక్తులు 

నిజామాబాద్ ఆగస్ట్ 31:(విజయ క్రాంతి): నిజామాబాద్ నగర నడిబొట్టునగల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలిచింది భక్తుల కోరికలను తీరుస్తూ విశేష ఆదరణ పొందుతున్న శుభం కరోతి గణపతి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి.

ఆదివారం మొదలుకొని శుభం కరోతి కళ్యాణం గణపతి ఆలయంలో సామూహిక అధర్వ శీర్ష పారాయణం పారాయణం జరిగింది. పారాయణానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.నిత్యం అన్నదానం అభిషేకాలు యజ్ఞాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఈ ఆలయంలో వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఈదవ రోజైనా ఆదివారం ఉదయం మొదలుకొని పంచామృత అభిషేకాలు కొనసాగాయి.

ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు.మంగళ హారతులతో కొబ్బరి లడ్డులతో రకరకాల పళ్ళతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ప్రతిరోజు సాయంత్రం ఆలయంలో ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ సిద్ధాంతి కిషోర్ శర్మ తెలిపా.ఆలయ అర్చకులు దీపక్ శర్మ శివకుమార్ రణధీర్ భూపాల్ ఆధారప్ప రాకేష్ మేఘన సుబేదార్ అవినాష్ సుబేదార్ సంతోష్ సుబేదార్ రాజ్ కుమార్ జగన్ గౌడ్ తదితరులు పూజ కార్యనిర్వహణ పాటల లో ఉన్నారు.