calender_icon.png 1 February, 2026 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జింకపై కుక్కల దాడి

01-02-2026 11:27:57 AM

స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం

చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలింపు

షాద్‌నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం పరిధిలోని నేషనల్ మార్ట్ ముందు జింక రాగా కుక్కలు ఒకసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆదివారం నేషనల్ మార్ట్ ముందు జింక ఒకసారిగా రాగా కుక్కలు వెంబడించి తీవ్రంగా గాయపరిచాయి. వెంబడే స్థానికులు కుక్కలను తరిమి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంబడే ఫారెస్ట్ అధికారులు తరలివచ్చి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.