17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇద్దరు సస్పెన్షన్.. ఇద్దరికి మెమోలు

01-02-2026 03:16 AM
  1. ఒకరికి షోకాజ్ నోటీస్
  2. యాదగిరిగుట్ట గుడిలో బంగారు, వెండి డాలర్ల మాయంపై ఈవో చర్యలు       

సూర్యాపేట (యాదాద్రి భువనగిరి), జనవరి 31 (విజయక్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదశాలలో చింతపండు, ప్రచార శాఖలో ఉండాల్సిన బంగారం, వెండి డాలర్లు ఇటీవల మాయమైన విషయం విధితమే. అయితే ఈ అంశాలను తీవ్రంగా పరిగ ణించిన ఆలయ ఈవో భవానీశంకర్ ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై అంతర్గత విచారణ అనంతరం దేవాలయ ప్రచార శాఖలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పి రామచంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ టి లక్ష్మి తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో వారిని శనివారం సస్పెండ్ చేశారు. అలాగే పర్యవేక్షకులు కె నటరాజు, సీతారామచార్యులకు చార్జి మెమోలు జారీ చేయడంతో పాటు ఏఈఓకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

కాగా మాయమైన బంగారం, వెండి డాలర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.