4 July, 2026 | 9:56 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేశ్

12-12-2024 07:47 PM

సింగపూర్,(విజయక్రాంతి): ప్రపంచ చెస్ చరిత్రలో దొమ్మరాజు గుకేశ్ సరికొత్త రికార్డు సాధించారు.  పిన్నవయస్కుడై గుకేశ్ ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా రికార్డు సాధించారు. చెస్ 14వ గేమ్ లో చైనాకు చెందిన డింగ్  లిరెన్ పే ను గుకేశ్ ఓడించి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంత్ తర్వాత  18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా రెండో భారతీయుడు గుకేశ్ విజయం సాధించి భారత్ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేశారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్ 2012లో భారత్ నుచి గెలిచి 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచారు. 2013 తర్వాత తొలి భారతీయుడిగా దొమ్మరాజు గుకేశ్  ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుకేశ్ కుటుంబం తమిళనాడులో సెటిల్ అయింది. తండ్రి రజనీ సర్జన్ కాగా, తల్లి పద్మ గృహిణి. గుకేశ్ నాలుగో తరగతి తర్వాత చెస్ పట్ల ఆకర్షితుడై దానిని నేర్చుకోవడం ప్రారంభించారు.