13-12-2024 12:15:11 AM
మస్కట్: మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 తేడాతో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. జట్టు తరఫున దీపిక నాలుగు గోల్స్‌తో మెరవగా.. సివాచ్ కనికా మూడు గోల్స్, రానా, లాల్‌రిన్‌పురి చెరొక గోల్ కొట్టారు. థాయ్ లాండ్‌పై విజయంతో రానున్న జూనియర్ హాకీ వరల్డ్‌కప్‌కు కూడా అమ్మా యిలు అర్హత సాధించారు. నేడు సెమీఫైనల్ జరగనుంది. గత ఎడిషన్‌లో దక్షిణ కొరియాపై విజయం సాధించిన భారత్ విజేతగా నిలిచింది.