calender_icon.png 18 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా

18-01-2026 01:28:40 AM

లేకపోతే కోటి మంది ప్రాణాలు బలెయ్యేవి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

80వ సారీ అదే ప్రకటన చేసిన అగ్రరాజ్యాధినేత

వాషింగ్టన్, జనవరి 17: భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధా న్ని ఎంతో మంచి పనిచేశానని తనకు తానే కితాబునిచ్చుకున్నారు. యుద్ధ ఆగిపోవడం వల్ల కోటి మంది ప్రాణాలను కాపాడగలిగానని డాంబికాలు పలికారు. అందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ తనకు కృతజ్ఞతలు కూడా తెలిపారని చెప్పుకొచ్చారు. అమెరికాకు చెందిన ‘సదరన్ బౌలేవార్డ్’ అనే సంస్థ పేరు ను తాజాగా ఆయన ‘డొనాల్డ్ జే ట్రంప్ బౌలేవార్డ్’గా మార్చారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

కాగా, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గతేడాది మే నుంచి ఇప్పటివరకు ట్రంప్ ఇది ౮౦వసారి ప్రకటించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా తాను ఎనిమిది యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదంటూ ట్రంప్ విచారం వ్యక్తం చేసి న ట్రంప్ మొత్తానికి, ఎలాగోలా నోబెల్ పురస్కారాన్ని తన దగ్గరికి రప్పించుకున్నారు. శాంతి బహుమతిని ఎగరేసుకుపోయిన వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడో తోనే ఈ అవార్డుకు ‘ట్రంప్ అర్హుడు’ అని చెప్పించుకున్నారు.