18-01-2026 01:30:48 AM
తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై, జనవరి ౧౭: తమిళుల సంస్కృతికి ప్రతీక జలికట్టు అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్ఘాటించారు. ఆ రాష్ట్రంలోని మధురై జిల్లా అలంకానల్లూర్‌లో శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల్లికట్టు ఫైనల్స్ పోటీ లను ప్రారంభించి మాట్లాడారు. జల్లికట్టులో ధీరత్వాన్ని ప్రదర్శించి, ఎద్దులను లొంగదీసుకున్న విజేతలకు పశుసంవర్ధక శాఖలో ప్రభు త్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలంకానల్లూర్‌లో రూ.౨ కోట్ల నిధులతో అత్యాధునిక వెటర్నరీ ఆసుపత్రి, జల్లికట్టి శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. మరోవైపు జల్లికట్టు పోటీల్లో 1,000 ఎద్దులు బరిలోకి దిగగా, 700 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. జల్లికట్టు వేడుకలను వీక్షించేందుకు విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్య లో రావడం విశేషం.