13 August, 2026 | 9:55 PM

కొత్త పల్లి రూరల్ బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

13-08-2026 08:42 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్త పల్లి రూరల్ బిజెపి ఆధ్వర్యంలో  ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని  దేశభక్తిని గురువారం రోజున నిర్వహించారు. ఈ తిరంగా ర్యాలీలో బిజెపి సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు  పాల్గొని మాట్లాడారు. దేశభక్తి భావనను పెంపొందించడానికి, ప్రజల్లో జాతీయ ఐక్యతను చాటడానికే ప్రతి ఏటా భారత ప్రభుత్వం  హర్ ఘర్ తిరంగా అభియాన్ అభియాన్‌ పేరిట ప్రోగ్రాం నిర్వహిస్తుందని తెలిపారు.

,దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మన జాతీయ గౌరవానికి, సార్వభౌమత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశం కోసం అందరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ ర్యాలీలో జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

"భారత్ మాతా కీ జై" నినాదాలతో  మార్మోగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి  మండల అధ్యక్షులు కుంట తిరుపతి ,సర్పంచులు నునుగొండ మానస ప్రవీణ్, కోమటిరెడ్డి అంజనీ కుమార్, ఉప సర్పంచ్లు కట్ల వెంకటేష్, అరె నరేష్ గౌడ్ మండలంలోని వార్డ్ మెంబర్స్,నాయకులు  జవ్వాజి రమేష్, కడార్ల రతన్, వేముల అనిల్ కుమార్,సోమినేని కర్ణాకర్, నలువాల మహేష్, నేరెళ్ల గంగారం, జిందం సుకుమార్, ఇల్లెందుల ఆనంద్, గోడిసెల రంజిత్ గౌడ్,మెరుగు మల్లేశం, రాచకొండ అనిల్ తదితరులతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.