13 August, 2026 | 9:43 PM

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

13-08-2026 08:37 PM

తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం

ములుగు,(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్ పి సి ఆధ్వర్యంలో గోవిందరావుపేట తాసిల్దార్  కార్యాలయంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం ఆర్ఐ సునీల్ కుమార్ కి మేమో రాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ యూఎస్ పిఎస్ ఆధ్వర్యంలో పలుమార్లు ధఫలవారీగా నిరసన కార్యక్రమాలు ఉపాధ్యాయుల సమస్యల కొరకు నిర్వహించిన ఫలితం లేదన్నారు.

కొత్త సమస్యలను సృష్టిస్తుంది ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఆరు డిఏ లు బకాయిలుగా లేవు మరి ఒకవైపు అన్ని రకాల ధరలు పెంచుకుంటూనే డీఎ పట్ల మొండి వైఖరి వహించడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అవుతుందని విమర్శించారు. పాఠశాల సమయంలో నిరంతర శిక్షణలో బోధనయేతర ఆన్లైన్ పనులతో టీచర్లను తరగతి గది బోధన నుండి దూరం చేస్తున్నారని అన్నారు. పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ప్రతినెల వందల సంఖ్యలో టీచర్లు రిటైర్మెంట్లతో ఉపాధ్యాయులు ఖాళీలు ఏర్పడుతున్నవి.

ఒకవైపు 27 పాఠశాలలను నాలుగువేలుగా చేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల పెంచుతున్నారు హెల్త్ కార్డులని ఉపాధ్యాయులకు కోటి యాభై లక్షల బీమాలని డూప్లికేట్ మాటలతో ఉదర గొడుతున్నారు. ఇప్పటివరకు నూతనంగా వచ్చిన హెల్త్ కార్డులతో రాష్ట్రములో ఒక ఉపాధ్యాయుడు కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ప్రభుత్వం యొక్క నాన్చవేత ధోరణికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని, ఉద్యోగుల పెన్సర్ల ఆరు డీయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ ఉద్యోగుల పెన్సర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సిపిఎస్ ను రద్దుచేసి ఓపియోస్నో ప్రకటించాలి. అన్ని యజమాన్య ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలి.  కేజీబీవీ యుఆర్ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం బేసిక్ పే అమలు చేయాలన్నారు.

ఎస్జిటిల అందరికీ సీనియార్టీ ప్రకారం పిఎస్ హెచ్ఎం ప్రమోషన్ కల్పించాలని, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పండిట్ పీటీ పోస్టులను అభివృద్ధి చేసి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, జీవో 317 ద్వారా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే బదిలీ చేసి తీర్చాలని కోరారు. మోడల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి. 

398  స్పెషల్ టీచర్లకు నోషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. పై అంశాలను తక్ష స్పందించి పరిష్కరించుటకు తగిన కృషి చేయాలి లేని పక్షంలో ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఆ తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్పిసి నాయకులు సిహెచ్ చాప బాబు,ఆర్ వాసుదేవరెడ్డి, కొర్ర రఘురాం, హాట్కర్  సమ్మయ్య, యాప కన్నయ్య, కొండా దిలీప్ కుమార్, బానోత్ విజయ్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.