13 August, 2026 | 9:55 PM

ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రవీణ్ పవార్

13-08-2026 08:44 PM

ఆర్మూర్,(విజయక్రాంతి):  ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా విద్యా, లోటస్ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ పవార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జరిగిన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో ఎన్నుకున్నారు. తనపై నమ్మకం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో కృషి చేసిన జిల్లా, రాష్ట్ర నాయకులకు  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రవీణ్ పవార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు బాషిత సుందర్, రాష్ట్ర బాధ్యులు మానస గణేష్, ప్రైవేట్ పాఠశాలల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.