16 April, 2026 | 6:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రక్తదానం ప్రాణదానంతో సమానం

30-10-2025 12:11 AM

ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి 

ఎల్లారెడ్డి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎల్లారెడి సిఐ రాజారెడ్డి, ఎస్త్స్ర మహేష్ కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారో త్సవాల భాగంగా బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్‌లో ఎల్లారెడ్డి సర్కిల్  పోలీస్స్టేషన్, ఆధ్వర్యంలో  నిర్వహించిన మెగా రక్తదాన, శిబిరంలో 55 మంది యువకులు, రక్తదానం చేశారు. అనంతరం సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో రక్తం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు.

యువత సన్మార్గంలో పయనించి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడా లని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు.ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవని, పోలీసులు ప్రజల కోసమే 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారన్నారు. అనంతరం మృతి చెందిన పోలీస్ అమరవీరులకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్, నాగిరెడ్డి పేట ఎస్త్స్ర భార్గవ్ గౌడ్, లింగం పేట ఎస్త్స్ర, దీపక్, గాంధారి ఎస్త్స్ర ఆంజనేయులు, పోలీస్ స్టేషన్ ల సిబ్బంది అనిల్ గౌడ్, బాలకృష్ణ, సాయికిరణ్, సందీప్ పాల్గొన్నారు.