23 June, 2026 | 8:40 PM

Breaking News

చర్ల రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా   •   ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ఆత్మకూరులో నూతన శివాలయానికి విరాళం

10-02-2026 05:44 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా తనవంతు సహాయంగా ముందుకు వచ్చి 51,116 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డిలు గ్రామస్తులతో కలిసి శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

శివాలయానికి విరాళం అందించినందుకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు మాజీ జడ్పిటిసి ఉమన్న గారి మనోహర్ రెడ్డి గ్రామస్తులతో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎల్లమ్మ ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భాస్కర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మల్లారెడ్డి, జితేందర్ రెడ్డి, విజయకుమార్, చిట్యాల నారాయణ, బిఆర్ఎస్ సీనియర్  నాయకులు మంగలి యాదగిరి, శ్రీనివాస్ నాయక్, పడమటి దుర్గేష్, గులపల్లి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.