4 April, 2026 | 2:48 AM

పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి విరాళం

04-04-2026 12:59 AM

వెంకటాపూర్, ఏప్రిల్3 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ముదిరాజ్ ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ స్వామి ఉదారంగా విరాళం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుగుణ రూ.40,116 లను గుడి నిర్మాణ నిధికి సమర్పించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేయడం, భక్తుల కోసం శ్రద్ధతో గుడి నిర్మాణం చేపడుతున్నట్లు వారు తెలిపారు.

పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు సర్పంచ్ చేసిన విరాళాన్ని అభినందిస్తూ, ఇతరులు కూడా ముందుకు వచ్చి గుడి నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమిష్టి సహకారంతో గుడి నిర్మాణం త్వరగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం పూర్తయితే గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారి, భక్తులకు విశేష సేవలందించనుందని స్థానికులు పేర్కొన్నారు.