4 April, 2026 | 2:44 AM

వాటెన్ ఐడియా గౌడ్ జీ..

04-04-2026 12:58 AM

మహబూబాబాద్,  ఏప్రిల్ 3(విజయక్రాంతి): వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు తలకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కొందరు సింపుల్గా వదిలేస్తుండగా, ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామంలో గండి కమలాకర్ అనే గీత కార్మికుడు తన తలపు రక్షణగా హెల్మెట్ ధరించి తాటి చెట్టు ఎక్కి దిగుతున్నాడు. తాటి చెట్టు ఎక్కి దిగే సమయంలో తాటి మట్టలు తలకు తగులుతున్నాయని, తేనెటీగలు దాడి చేస్తున్నాయని, హెల్మెట్ వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నాడు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ బరువుగా భావించే కొందరూ వాహనదారులకు గీత కార్మికుడు కమలాకర్ తన వృత్తిలో హెల్మెట్ ధరించి ఆదర్శంగా నిలుస్తున్నారు.