20 April, 2026 | 2:46 AM

ఆలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం

20-04-2026 12:38 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 19 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు,కిష్టాపూర్ డివిజన్ పరిధిలో గల అర్చన కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ 51వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాఘవేందర్ గౌడ్ ను శాలువాతో సత్కరించి విరాళాన్ని అందజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను సొంత నిధులతో పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో  అర్చన కాలనీ సేవా సమితి అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి.ఉపాధ్యక్షులు బుచ్చి రాములు కాలనీ వాసులు హనుమంత్ రెడ్డి, మల్లారెడ్డి, మెట్టు రాజు, కమలాకర్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.