17 April, 2026 | 12:54 PM

సి సి కె డి రోగికి ప్రాణదానం

05-06-2025 06:03 PM

విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన యశోద డాక్టర్లు..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): దీర్ఘకాలికమైన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చావు దగ్గరికి వెళ్లిన రోగిని అత్యాధునిక ప్రమాణాలతో కూడిన చికిత్స అందించి ప్రాణాలు కాపాడామని యశోద ఆసుపత్రి(Yashoda Hospitals)కి చెందిన డాక్టర్లు వీరమనేని చేతన్ డాక్టర్ బి వెంకటరెడ్డి లు. గురువారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్లగొండ పట్టణం మామిళ్లగూడెంకు చెందిన గుజ్జల జనార్దన్ రెడ్డి(56) అనే రోగి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో మూత్రం రాక కడుపు ఉబ్బి జ్వరం శ్వాస సమస్యలు కాళ్ల వాపుతో బాధపడుతూ నల్లగొండ లోకల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. 

రోగికి వ్యాధి నయం కాకకోవడంతో యశోద ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. వెంటనే తాము సకాలంలో రోగి స్థితిని గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకొని. అరుదైన చికిత్స చేసి అతన్ని కాపాడినట్లు తెలిపారు.అతనికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కి కారణమైన గ్లో మేరీలో నెఫ్రాటిస్ వ్యాధి బయటపడిందని, వెంటనే తాము దానికి అనుగుణంగా చికిత్సను మార్చడం వల్ల రోగి ప్రాణాలను కాపాడడం సాధ్యమైందన్నారు. ప్రస్తుతం రోగి పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పొంది తన పని తాను చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి కోఆర్డినేటర్ ఏ వాసు కిరణ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.