జాతీయ రక్షణ నిధికి రూ.లక్ష విరాళం
గద్వాల, మే 19 ( విజయక్రాంతి ) : జాతీయ రక్షణ నిధికి విరాళంగా లక్ష రూపాయ ల విలువ గల చెక్కును అందజేసిన గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి ని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అభినందించారు. సోమవారం కలెక్టర్ ఐడీఓసీ సమావేశం హాల్ నందు వడ్డే పల్లి మండలం కోయిల దిన్నె గ్రామానికి చెందిన గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి రైతు,వి శ్రాంత ఉపాధ్యాయులుగా, సమాజ సేవకు అంకితమై, అపారమైన దేశ భక్తిని ప్రదర్శించారు.
రైతు భరోసా పథకం ద్వారా తన బ్యాంకు ఖాతాలో జమైన రూ. లక్ష ను జాతీ య రక్షణ నిధికి విరాళంగా అందజేసి, దేశ రక్షణ కోసం నిరంతరం సాహసంగా సేవలందిస్తున్న భారత సాయుధ దళాల పట్ల తన గాఢమైన గౌరవాన్ని,సేవా భావాన్ని గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి ప్రదర్శించారు.సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని ఇతరులకు చేరువ చే యడం గొప్ప ఉదాహరణ. లక్మీకాంతారెడ్డి గారి సేవా స్పూర్తి అందరికీ ప్రేరణగా నిలవాలని అన్నారు.






